అమిత్‌ షా, జూ. ఎన్టీఆర్‌ భేటీలో వాటి గురించే మాట్లాడారు: కిషన్‌రెడ్డి

22 Aug, 2022 20:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణలో పర్యటనలో భాగంగా నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి లంచ్‌ చేశారు. అమిత్‌ షా బిజీ షెడ్యూల్‌ మధ్య జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే వారి భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. వారిద్దరూ కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దివంగత ఎన్టీఆర్‌ సినిమాలు, ఆయన రాజకీయ జీవితం, అందించిన సేవలు గురించి మాత్రమే మాట్లాడుకున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. 

చదవండి: (కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జూ.ఎన్టీఆర్‌ భేటీ)

మరిన్ని వార్తలు