తెలుగు రాష్ట్రాలకు ఐపీఎస్‌ల కేటాయింపు

17 Jan, 2024 13:03 IST|Sakshi

ఢిల్లీ, సాక్షి: తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్‌ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్‌కు చెందిన వాళ్లు. 

తెలంగాణకు అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్‌, సాయి కిరణ్‌, మనన్‌ భట్‌, రాహుల్‌ కాంత్‌, రుత్విక్‌ సాయిని కేటాయించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసిన సీఎం రేవంత్‌ రెడ్డి అదనంగా ఐపీఎస్‌ అధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అధికారుల పేర్లపై స్పష్టత రావాల్సి ఉంది. 

>
మరిన్ని వార్తలు