రాష్ట్రానికి వరద సాయమేదీ? 

24 Jul, 2022 01:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. వరదలతో రూ.1,400 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని తెలిపారు. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా, ఇప్పటిదాకా ఉలుకు పలుకు లేదని విమర్శించారు.

నాలుగేళ్లుగా వివిధ రాష్ట్రాలకు వరద సహాయం అందించిన కేంద్రం.. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆర్థిక సాయం చేయాల్సింది పోయి.. పాలు, పప్పు, ఉప్పులపై జీఎస్టీ రూపంలో సామాన్యులపై పన్నుల భారం మోపిందని విమర్శించారు. తక్షణ సహాయం కింద వెంటనే రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఇంద్రకరణ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు