గిరిజనులపై దాడులు అమానుషం: చాడ 

30 Aug, 2021 02:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గిరిజనులపై అటవీశాఖ అధికారుల దాడులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో ఖండించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతయ్య గూడెంలో అటవీశాఖ అధికారులు 55 ఎకరాల్లో పోడు సాగు చేసుకుంటున్న రైతులపై దాడులు చేయడం అమానుషమన్నారు. ఈ ఘటనతో తీవ్రంగా మానసిక వేదనకు గురైన ఇద్దరు రైతులు అక్కడికక్కడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, వారికి చికిత్స అందించారని తెలిపారు. పోడు సాగుదారులకు పట్టాలు పంపిణీ చేసేంతవరకూ కమ్యూనిస్టు పార్టీ అలుపెరుగని ఉద్యమం చేస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే పోడు సాగుదారులపై దాడులు నిలిపివేతకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు