జైలు వంటలు లేనట్లేనా..? 

22 Dec, 2020 09:05 IST|Sakshi

సాక్షి, చంచల్‌గూడ: తెలంగాణ జైళ్ల శాఖ చంచల్‌గూడలో రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మై నేషన్‌ పేరుతో ప్రారంభించిన ఫుడ్‌కోర్టు మూతపడింది. వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వంటకాల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఈ కేంద్రంలో నియమించారు. ప్రజలకు రుచికరమైన భోజనం అందించారు. మీల్స్, టిఫిన్స్‌తో పాటు చికెన్‌ బిర్యానీ విక్రయించారు. బహిరంగ మార్కెట్లో చికెన్‌ బిర్యానీ రూ.180 నుంచి రూ.220 వరకు లభించగా.. ఈ ఔట్‌లెట్‌లో కేవలం రూ.90లకే విక్రయించేవారు. ధర తక్కువగా ఉండటంతో ఈ మార్గంలో వెళ్లేవారు బిర్యానీ రుచి చూసి వెళ్లేవారు. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నుంచి మూతపడింది.

సిటీ మార్కెట్లోకి ఎపిస్‌ కుంకుమ పువ్వు 
చలికాలంలో కేసర్‌ లేదా కుంకుమపువ్వు వినియోగం పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఎఫ్‌ఎమ్‌జీజీ బ్రాండ్‌.. ‘ఎపిస్‌’ సాఫ్రాన్‌(కుంకుమ పువ్వు)ని సిటీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కుంకుమ పువ్వుని విభిన్న రూపాల్లో వినియోగించడం ద్వారా సాధారణ దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందని భారతీయ వైద్య విధానం చెబుతోందని వీరు వివరించారు. నగరంలోని హైపర్‌ స్టోర్స్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ ప్లాట్‌ఫామ్స్‌ మీద వన్‌ గ్రామ్‌ ఎపిస్‌ సాఫ్రాన్‌ ప్యాక్‌ని అందుబాటులోకి తెచ్చామన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు