ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీల్లో మార్పులు.. ఆప్షన్లకు చివరి తేదీ ఎప్పుడంటే?

31 Aug, 2022 01:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో సాంకేతిక విద్య శాఖ అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీలో ద్వితీ­య సంవత్సరం ఉత్తీర్ణులైవారికి అవకాశం కల్పించేం­దుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవా­నికి తొలివిడత ఎంసెట్‌ రిజిస్ట్రే­షన్, స్లాట్‌ బుకింగ్‌ గడువు సోమవారం, ధ్రువపత్రాల పరిశీలన గడువు మంగళవారం ముగిసింది.

అయితే, తాజాగా మంగళవారమే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో ఉత్తీర్ణులు ఎంసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో స్లాట్‌ బుకింగ్, ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్లకు కొత్త తేదీలను ప్రకటించారు.  

మరిన్ని వార్తలు