Hyderabad: నేను డిప్యూటీ సీఎం అయ్యాక అంతు చూస్తా...

20 Nov, 2022 20:06 IST|Sakshi
కోరె నందుకుమార్‌

సాక్షి, హైదరాబాద్‌(బంజారాహిల్స్‌): ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు కోరె నందుకుమార్‌ అలియాస్‌ నందుపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో మరో చీటింగ్‌ కేసు నమోదైంది. వ్యవసాయ భూమికి సంబంధించి కమీషన్‌ కోసం తనను బెదిరించడమే కాకుండా అంతు చూస్తానంటూ హెచ్చరించాడని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యా పారి ఎస్‌.సతీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో ఓ భూమి లావాదేవీలకు సంబంధించి రూ.21 లక్షలు నందుకుమార్‌కు ఇచ్చామని ఈ విషయంలోనే పలుమార్లు తనను బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. త్వరలోనే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని అప్పుడు తాను డిప్యూటీ చీఫ్‌ మినిష్టర్‌ను అవుతానని, పరిగి సమీపంలోని దోమ మండలం భూంపల్లి గ్రామంలో 12 ఎకరాల స్థలం తన పేరు మీద రాయకపోతే అంతు చూస్తానని బెదిరించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: (తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు