Cyber Crime: అమెరికా వెళ్లాకే పెళ్లి అని, 22 లక్షలు కొట్టేశాడు!

2 Sep, 2021 07:58 IST|Sakshi

పెళ్లి పేరుతో రూ.21.74 లక్షలు మోసం  

నగరంలోనూ వంశీపై కేసు  

సాక్షి, సిటీబ్యూరో: మాట్రిమోనియల్‌ సైట్స్‌ ద్వారా పెళ్లి పేరుతో యువకులకు ఎర వేసి మోసాలకు పాల్పడుతున్న వంశీకృష్ణపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలోనూ కేసు నమోదైంది. ఇతగాడిని మూడు రోజుల క్రితం ఇలాంటి కేసులోనే రాచకొండ అధికారులు పట్టుకున్నారు. ఇతడి వలలో పడి రూ.21.74 లక్షలు కోల్పోయిన సికింద్రాబాద్‌ యువతి ఫిర్యాదు మేరకు బుధవారం నగరంలో కేసు నమోదు చేశారు.

వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన యువతి తన ప్రొఫైల్‌ను షాదీ.కామ్‌లో పొందుపరిచారు. దీన్ని లైక్‌ చేసిన పొట్లూరి బాల వంశీకృష్ణ అనే ప్రొఫైల్‌ కలిగిన వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు చాటింగ్‌ తర్వాత పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. అయితే తాను అమెరికా వెళ్లిన తర్వాతే పెళ్లని నమ్మించాడు. వీసా కోసం రూ.20 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌ లేదా డిపాజిట్‌ అవసరమని యువతితో చెప్పాడు. దీంతోపాటు కొన్ని ఖర్చుల కోసమంటూ బాధితురాలి నుంచి రూ.21.74 లక్షలు బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయించుకుని మోసం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీని పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. 

చదవండి :  OnlinePaymentFraud: టీవీ రీచార్జ్‌, ఘరానా మోసం
Chandan Mitra: కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం

మరిన్ని వార్తలు