మానవత్వాన్ని పెంపొందించుకోవాలి

7 Aug, 2022 01:57 IST|Sakshi
‘ఎన్‌హ్యాన్సింగ్‌ ఎఫెక్టివ్‌నెస్‌’ అంశంపై రాష్ట్ర వ్యాప్త ప్రచారాన్ని ప్రారంభిస్తున్న హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

రాయదుర్గం: మనమంతా మానవులుగానే మిగిలిపోదామని, మానవత్వాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమా రీస్‌ సంస్థ ఆధ్వర్యంలో గ్లోబల్‌ పీస్‌ ఆడిటో రియంలో అడ్మినిస్ట్రేటర్స్‌ కోసం ‘ఎన్‌హ్యా న్సింగ్‌ ఎఫెక్టివ్‌నెస్‌’అనే అంశంపై శనివారం నిర్వహించిన సమావేశాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మా ట్లాడుతూ.. తాను నిరంతరం న్యాయ, జీవిత విద్యార్థిగా ఉండాలని కోరుకుంటానన్నారు.

అధికారం, గుర్తింపు, దర్పం అనేవి తాత్కాలికమని ఆయన చెప్పారు. ఇప్పటివరకు తను సాధించిన విజయాలు తన సొంతమని, ఇతరులపై ఎప్పుడూ ఆధా రపడలేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. బ్రహ్మకుమారీస్‌ సంస్థతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వివరించారు. ప్రతి ఒక్కరూ నిత్యం మెడిటేషన్, యోగాపై దృష్టి పెట్టాలని బ్రహ్మకుమారీస్‌ సంస్థ అడ్మినిస్ట్రేటర్స్‌ వింగ్‌ చైర్‌పర్సన్‌ రాజయోగిని ఆశాదీదీ, శాంతిసరోవర్‌ డైరెక్టర్‌ రాజయో గిని కుల్‌దీప్‌దీదీ సూచించారు.

రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ‘ఎన్‌హ్యా న్సింగ్‌ ఎఫెక్టివ్‌నెస్‌’ (మెరుగు పర్చుకోవడం, ప్రభావం) అనే అంశాలపై ప్రచారం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఆడియో, దృశ్య ప్రదర్శన, నృత్య ప్రదర్శ నలు, మెడిటేషన్, ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రామలింగేశ్వరరావు, జస్టిస్‌ ఎం. సుధీర్‌కుమార్, సీనియర్‌ న్యాయవాది రాజేందర్‌రెడ్డి, నిజాం మునిమనుమడు రౌనక్‌యార్‌ఖాన్, రాజయోగిని బీకే శక్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు