చిన్నారి సుమేధ కపూరియా అంత్యక్రియలు పూర్తి

19 Sep, 2020 09:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలో ఉన్న ఈస్ట్‌ దీనదయాళ్‌నగర్ ఓపెన్‌ ప్రమాదవశాత్తు నాలాలో పడి శుక్రవారం మృతి చెందిన పన్నెండేళ్ల చిన్నారి సుమేధ కపూరియా అంత్యక్రియలు శనివారం జరిగాయి. మల్కాజిగిరిలోని పటేల్‌ నగర్‌ స్మశాన వాటికలో దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి. దహన సంస్కారాలకు సమేధ మృత దేహాన్ని తరలించిన తల్లిదండ్రులు, కుంటుంబ సభ్యులు శోకసంద్రంతో ఉన్నారు. శుక్రవారం సరదాగా సైకిల్‌ తొక్కుదామని బయటికి వెళ్లిన బాలిక కనిపించకుండా పోయి దాదాపు పన్నెండు గంటల తరువాత నాలా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని బండచెరువులో విగతజీవిగా లభించింది. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యానికి అభంశుభం తెలియని చిన్నారి బలైపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. (ఉసురు తీసిన నాలా)

సుమేధ మృతికి జీహెచ్‌ఎంసీ అధికారులే కారణం:
తమ కూతురు సుమేధ మృతి చెందడానికి పరోక్షంగా జీహెచ్‌ఎంసీ అధికారులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులపై బాలిక తల్లిదండ్రులు నేరెడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


మరిన్ని వార్తలు