పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాల్లోనే ప్రోత్సహించాలి: తలసాని

25 May, 2022 14:06 IST|Sakshi

హైదరాబాద్‌: పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాలలో  ప్రోత్సహించాలని, అప్పుడే వారు మరింత ఉన్నతంగా రానిస్తారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సైదాబాద్ కు చెందిన న్యాయవాది ఫసియోద్దిన్ ఇటీవల గోవాలో ఈ నెల 6 నుండి 8 వ తేదీ వరకు జరిగిన నేషనల్ టైక్వాండో చాంపియన్ షిఫ్ లో సిల్వర్ మెడల్స్ సాధించిన తన ఇద్దరు కుమార్తె లు ఉమైమా పాతిమా, సుమమ పాతిమా లతో కలిసి వచ్చి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...  ఇంట చిన్న వయసులోనే నేషనల్ లెవెల్ పోటీలలో సిల్వర్ మెడల్ ను సాధించడం చిన్నారుల పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణం అన్నారు. అవార్డు లు సాధించిన ఇద్దరు చిన్నారులను మంత్రి అభినందించారు. మరింతగా రానించే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి ప్రకటించారు.

మరిన్ని వార్తలు