‘ఏబీఎన్‌ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి’

21 Dec, 2020 15:05 IST|Sakshi
ఏబీన్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న క్రైస్తవ సంఘాల ప్రతినిధులు

క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ ప్రతినిధుల డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌‌: క్రిస్టియన్ల మనోభావాలను కించపరిచే విధంగా కథనాన్ని ప్రసారం చేసిన ఏబీఎన్‌ చానెల్‌పై క్రైస్తవ సంఘాలు మండిపడ్డాయి. శనివారం రాత్రి ఛానెల్‌లో ప్రసారమైన ‘కిరాక్‌’ కార్యక్రమంలో యాంకర్‌ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ నాయకులు ఆదివారం సాయంత్రం ఫిలింనగర్‌లోని చానెల్‌ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు ఏబీఎన్‌ అధినేత వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చానెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ రొంపిలోకి క్రైస్తవులను లాగడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలికి చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

క్రైస్తవులకు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు చానెల్‌ ప్రతినిధులకు లేఖ అందజేశారు. వివిధ సంఘాల నాయకులు శామ్యూల్‌ గౌరిపాగ, మలాకి, సాల్మన్‌రాజ్, సుందర్‌రాజు, కెన్నడి, ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు