శ్రీశైలం ప్రమాదం: కొనసాగుతున్న సీఐడీ విచారణ

23 Aug, 2020 10:47 IST|Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇక షార్ట్ సర్క్యూట్‌కు గల కారణాలను సీఐడీ దర్యాప్తు బృందం విశ్లేషించనున్నది. ప్రమాదం జరిగిన స్థలంలో ప్రాథమిక సాక్ష్యాలను దర్యాప్తు బృందం సేకరించింది. కాలిపోయిన వైర్లతో పాటు పవర్ సప్లైకి ఉపయోగించిన వైర్లకు సంబంధించిన కాలిన పదార్థాలను ఫోరెన్సిక్‌ బృందం సీజ్ చేసింది. పవర్ జనరేషన్, సప్లై ఎలా జరిగిందని టెక్నికల్‌ బృందాలు వీడియో తీశారు. (కాంగ్రెస్‌ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత)

పవర్ సప్లై ఎలా ఇచ్చారనే వివరాలు సీఐడీ రాబడుతోంది. పలువురు అధికారుల నుంచి సీఐడీ స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసింది. మొదట ఫైర్ యాక్సిడెంట్‌ జరిగిన చోట ఫ్లోర్ పగిలి ఉన్న స్థలంలోని పదార్థాలను అధికారులు సేకరించారు. అక్కడ కాలిన పదార్థాలలో వాటర్ ఉందా? లేదా? అన్న దానిపై సీఐడీ టెక్నికల్‌ బృందం విశ్లేషించనుంది. గతంలో జరిగిన ప్రమాదాలతో ఈ  ప్రమాదాన్ని పోల్చలేమని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. మరికొన్ని సాక్ష్యాల కోసం అధికారులు విచారణ చేపట్టారు. మానవ తప్పిదం ఉందా లేదా అనేది సీఐడీ అధికారులు తేల్చనున్నారు. (శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ)
చదవండి: (‘ఫాతిమా చిన్నప్పటి నుంచీ ధైర్యశాలి’)

>
మరిన్ని వార్తలు