సిద్దిపేటలో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు 

20 Dec, 2022 03:20 IST|Sakshi
మాట్లాడుతున్న చుక్క రాములు, భాస్కర్‌  

ఈ నెల 21, 22, 23 తేదీల్లో నిర్వహణ 

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు 

సిద్దిపేట అర్బన్‌: సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించే సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌ పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన మహాసభల సన్నాహక సమావేశంలో రాములు మాట్లాడుతూ సిద్దిపేటరెడ్డి సంక్షేమ భవన్‌లో నిర్వహించే మహాసభల ప్రాంగణానికి మల్లు స్వరాజ్యం, సున్నం రాజయ్యల పేర్లు ప్రతిపాదించినట్లు తెలిపారు.

రాష్ట్రం నలుమూలల నుంచి 600 మంది ప్రతినిధులు మహాసభలకు హాజరవుతారన్నారు. మూడు రోజులపాటు జరిగే మహాసభలకు ఇతర కార్మిక సంఘాలను కూడా ఆహ్వానిస్తున్నాని చెప్పారు. మహాసభల చివరి రోజు జరిగే బహిరంగ సభకు కేరళ మంత్రి శివమ్స్‌ కుట్టి వస్తారన్నారు. కార్మిక చట్టాలు, ధరల పెరుగుదల, విద్యుత్‌ చట్టం, రైతాంగ సమస్యలపై ఏప్రిల్‌ 5న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించే అవకాశాలున్నాయని తెలిపారు. సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, శశిధర్, సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు