ఆన్‌లైన్‌లో సివిల్స్‌ శిక్షణ

28 Nov, 2020 09:00 IST|Sakshi

క్రిష్ణప్రదీప్‌ 21 సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ ఆధ్వర్యంలో కోచింగ్‌

మీడియా పార్టనర్‌గా    సాక్షి మీడియా గ్రూప్‌

 ఫీజు రిజిస్ట్రేషన్‌కు డిసెంబరు  16 వరకు అవకాశం

కరీంనగర్‌: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు తెలంగాణలో ఎనలేని క్రేజ్‌. ఏటా వేల మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి ప్రతిష్టాత్మక సర్వీసులే లక్ష్యంగా.. సివిల్స్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతుంటారు. యూపీఎస్సీ వందల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తే.. దేశవ్యాప్తంగా ఆరు లక్షల మందికిపై దరఖాస్తు చేసుకుంటారు. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ.. ఇలా మూడంచెల సివిల్స్‌ ఎంపిక ప్రక్రియలో.. విజయం సాధించాలంటే.. కనీసం ఏడాదిన్నరపాటు నిపుణుల సలహాలతో అంకితభావంతో ప్రిపరేషన్‌ సాగించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా విద్యార్థులు వ్యక్తిగతంగా క్లాసులకు రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు వీలున్న సమయంలో నిపుణులు రూపొందించిన వీడియో క్లాసులు వింటూ.. సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యేలా.. క్రిష్ణప్రదీప్‌ 21 సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ ఆధ్వర్యంలో యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ కోచింగ్‌ అందిస్తోంది. ఇందుకు సాక్షి మీడియా గ్రూప్‌.. మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఠీఠీఠీ. జుpజ్చీట. ఛిౌఝలో లాగిన్‌ అయి రిజిస్టర్‌ చేసుకోవచ్చు. కోర్సు కాల వ్యవధి ఏడాదిన్నర.‡ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.25,000. ప్లే స్టోర్‌ నుంచి  క్రిష్ణప్రదీప్‌ 21 సెంచరీ ఐఏఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా వీడియో క్లాసులు వినొచ్చు. ఈ వీడియోలను ఎప్పుడైనా, ఎక్కడైనా మొబైల్‌లో చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్‌లో స్టడీ మెటీరియల్, అసైన్‌మెంట్స్, మల్టీపుల్‌ ఛాయిస్‌ క్వశ్చన్స్‌ టెస్టులు ఉంటాయి. టెస్ట్‌ సబ్‌మిట్‌ చేయగానే ఫలితం వస్తుంది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 9133637733, 9505514424, 9666013544 పని దినాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు   సంప్రదించొచ్చు.  

మరిన్ని వార్తలు