నేడు సివిల్స్‌ ప్రిలిమ్స్‌

4 Oct, 2020 02:03 IST|Sakshi

హైదరాబాద్, వరంగల్‌ కేంద్రాల్లో పరీక్ష

మాస్కులు లేకుంటే అనుమతించరు

సాక్షి, హైదరాబాద్‌: యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఆది వారం సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ–2020 పరీక్ష  జరుగ నుంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్‌ కేంద్రా లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం మొత్తం 115 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 99 పరీక్షా కేంద్రాలలో 46,171 మంది పరీక్ష రాయనున్నారని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్, ఎన్నికల కో–ఆర్డినేటింగ్‌ సూపర్‌వైజర్‌ శ్వేతా మహంతి తెలిపారు.

అలాగే వరంగల్‌లోని 16 కేంద్రాలలో 6,763 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు వెల్లడించారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 వరకు రెండు సెషన్లలో పరీక్ష జరుగనుంది. పరీక్షా కేంద్రాల నిర్వహణ కోసం హైదరాబాద్‌లో వెన్యూ సూపర్‌ వైజర్లతో పాటు 99 లోకల్‌ ఇన్‌స్పెక్షన్‌ అధికారులు, 34 మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు. 

నిబంధనలివీ...

  • మాస్కులు ఉంటేనే అభ్యర్థులను పరీక్షకు అనుమతిస్తారు.
  • అడ్మిట్‌ కార్డుతోపాటు గుర్తింపు కార్డు తప్పని సరి.
  • ఎలక్ట్రానిక్‌ పరికరాలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు.
  • పర్సులు, వాచ్, మొబైల్‌ ఫోన్స్, పెన్‌డ్రైవ్, కాలుక్యులేటర్లు, ఇతర రికార్డింగ్‌ పరికరాలు అనుమతించరు.
  •  హాల్‌టికెట్‌లో సూచించిన పరీక్షా కేంద్రాల్లో మాత్రమే పరీక్షకు అనుమతి. 
     
>
మరిన్ని వార్తలు