32 జ్యుడీషియల్‌ జిల్లా కోర్టుల ప్రారంభం

2 Jun, 2022 03:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త జిల్లాల ప్రాతిపదికన 32 జ్యుడీషియల్‌ జిల్లా (హైదరాబాద్‌ మినహా) కోర్టులు గురువారం ప్రారంభం కానున్నాయి. హైకోర్టు ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ.రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వీటిని ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 10 జ్యుడీషియల్‌ జిల్లా కోర్టులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నాయి. 

దాదాపు మూడేళ్ల క్రితం 10 రెవెన్యూ జిల్లాలను 33 జిల్లాలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్త జ్యుడీషియల్‌ జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు న్యాయస్థానాలు మరింత చేరువకానున్నాయి. జిల్లా కోర్టుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పనుంది. ఇదిలాఉండగా, 33 జ్యుడీషియల్‌ జిల్లాలను గుర్తిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక జీవో జారీ చేసింది. అలాగే ఆయా జ్యుడీషియల్‌ కోర్టుల పరిధులను ఇందులో పేర్కొంది.   

మరిన్ని వార్తలు