కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రయత్నం కావాలి: సీజేఐ

4 Dec, 2021 11:48 IST|Sakshi

మీడియేషన్‌, ఆర్బిట్రేషన్‌పై సదస్సులో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

సాక్షి, హైదరాబాద్‌: ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌లో వివాదాలకు పరిష్కారం లభిస్తుందని సీజేఐ  జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. హెచ్‌ఐసీసీలో మీడియేషన్‌, ఆర్బిట్రేషన్‌పై జరిగిన సదస్సులో జస్టిస్‌ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, వివిధ కారణాల వల్ల పరిశ్రమల్లో వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. వివాదాల పరిష్కరానికి మధ్యవర్తిత్వాలు ముఖ్యమన్నారు. ఆర్బిట్రేషన్‌ సెంటర్‌కు హైదరాబాద్‌ అనుకూలమని తెలిపారు. పెండింగ్‌ కేసుల పరిష్కారం సత్వరమే జరగాలన్నారు. కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రయత్నం కావాలన్నారు. ఏళ్ల తరబడి కోర్టు కేసుల ద్వారా సమయం వృధా అవుతోందన్నారు. ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సీజేఐ ధన్యవాదాలు తెలిపారు.

చదవండి: Omicron: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు

‘లార్డ్ కృష్ణ  కౌరవులకు, పాండవులకు మధ్యవర్తిత్వం చేశాడు. ఎవరికైనా వ్యక్తి గత జీవితంలో సమస్యలు వస్తే వారిని మనం దూరంగా పెడుతాం. ప్రతిరోజు సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు లేకుండా మనిషి ఉండడు. బిజినెస్‌లో సమస్యలు వస్తే కోర్టులకు వస్తారు. 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలి. అంతర్జాతీయ పరిస్,సింగపూర్, లండన్, హంకాంగ్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడం చాలా సంతోషం. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు, ఐటి కంపెనీలు సహకారం కూడా ఎంతో అవసరం. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నంబర్‌వన్‌గా ఉంది. ఆర్బిట్రేషన్ సెంటర్‌ను నెలకొల్పడంలో జస్టిస్ హిమా కోహ్లీ సహకారం మర్చిపోలేనని’’ సీజేఐ అన్నారు.

త్వరలో శాశ్వత భవనం: సీఎం కేసీఆర్‌
హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ ఆర్బిట్రేష‌న్ అండ్ మీడియేష‌న్ సెంట‌ర్ (IAMC) ఏర్పాటు చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌ని ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు(కేసీఆర్‌) అన్నారు. ఆర్బిట్రేష‌న్ కేంద్రానికి హైద‌రాబాద్ అన్నివిధాలా అనువైన ప్రాంతమ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు కోసం ప్ర‌స్తుతం 25 వేల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లం కేటాయించామ‌ని, శాశ్వ‌త భ‌వ‌నం కోసం త్వ‌ర‌లో పుప్పాలగూడ‌లో భూమి కేటాయిస్తామ‌ని సీఎం తెలిపారు.


 

మరిన్ని వార్తలు