అడవి బిడ్డలపై దాడి అత్యంత హేయం: భట్టి విక్రమార్క

28 Mar, 2021 16:26 IST|Sakshi

 సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: నాగర్ కర్నూల్ జిల్లాలో అటవీ ప్రాంతంలో అడవి బిడ్డలపై అటవీ సిబ్బంది పైశాచిక దాడిని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఇప్పపూలు, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్లిన గిరిజనులపై జరిగిన దాడిలో 14 మహిళలు, 9 మంది పురుషులకు  తీవ్ర గాయాలయ్యాయని, వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. అటవీ ఉత్పత్తులను సేకరించడం తప్పు కాదని, ఉత్పత్తుల సేకరణపైనే ఆధారపడి చెంచు, లంబాడాలు ఆధారపడి జీవిస్తున్నారని,  29 రకాల అటవీ ఉత్పత్తులను సేకరించి  ఉపాధి పొందవచ్చు అని అటవీ చట్టం చెబుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

గిరిజనులకు రోగం వస్తే హెలికాప్టర్లో తీసుకువచ్చి కార్పొరేట్ దవాఖానల్లో చేర్చించి కడుపులో పెట్టి చూసుకుంటామని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, పోడు భూముల సమస్యను తనే కుర్చీ వేసుకుని పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు ఏమయ్యాయని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గిరిజన మహిళలను చెట్లకు కట్టేసి కొట్టిన అరాచకాలు టీఆర్‌ఎస్‌ పాలనలో ఉందని, గత ఏడేళ్లుగా అనేక ప్రాంతాల్లో అధికారులు, అధికార పార్టీల నేతల ఆగడాలకు అడ్డేలేకుండా పోయిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
చదవండి:
తెలంగాణలో పండుగలు, పబ్బాలు లేవు! 
కరోనా తెచ్చిన కష్టం; ఊరి చివర గుడిసె.. ఒంటరిగా బాలిక

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు