ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో బస్సు కోసం ధర్నా 

23 Aug, 2022 01:00 IST|Sakshi
వాసాలమర్రిలో బస్సుల కోసం రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు, నాయకులు 

తుర్కపల్లి: పాఠశాల సమయానికి బస్సులు లేవని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రి విద్యార్థులు సోమవారం గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్‌ నాయకులు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. పాఠశాల సమయానికి బస్సులు లేక పోవడంతో విద్యార్థులు ఆటోల్లో వెళ్లాల్సి వస్తోందని, ఆటోలు రాకపోతే స్కూల్‌కు నడిచి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి, గజ్వేల్‌ రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు గ్రామానికి చేరుకుని రాస్తారోకోను విరమింపచేశారు. 

మరిన్ని వార్తలు