ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్‌పై స్పందించిన కేసీఆర్‌.. ఏమన్నారంటే!

27 Feb, 2023 19:49 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్: ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇది ప్రధాని మోదీ-అదానీ అనుబంధం నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించడానికి చేసిన పనే త‌ప్ప మ‌రొక‌టి కాదని కేసీఆర్ పేర్కొన్నారు.

ఐదు రోజుల సీబీఐ కస్టడీకి సిసోడియా
ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను రౌస్‌ అవెన్యూ కోర్టులో సోమవారం సీబీఐ హాజరుపరిచింది. ఈ కేసులో ఆయనను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది. తాము అడిగే ప్రశ్నలకు సిసోడియా సరిగ్గా సమాధానాలు ఇ‍వ్వడం లేదని, మొబైల్‌ ఫోన్లు కూడా మార్చారని కోర్టుకు చెప్పింది. ఈ కేసులో ఆయనదే కీలక పాత్ర అని, అయిదు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోర్టు కోరింది. సీబీఐ అధికారుల విజ్ఞప్తి మేరకు సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. సిసోడియా అరెస్టును వివిధ రాజకీయ పార్టీలు ఖండించాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నేతలపై దాడులకు ఉపయోగిస్తోందని విమర్శించాయి. సిసోడియా అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది.

చదవండి: సీబీఐని నాకు అప్పగిస్తే.. వాళ్లను రెండు గంటల్లో అరెస్టు చేయిస్తా: ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌

మరిన్ని వార్తలు