దుబ్బాక ఎన్నికపై కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

29 Oct, 2020 15:48 IST|Sakshi

గెలుపు ఎప్పుడో డిసైడ్‌ అయింది: సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్‌ గురువారం మీడియాతో చిట్‌చాట్‌లో ... దుబ్బాక గెలుపు ఎప్పుడో డిసైడ్‌ అయింది. గ్రౌండ్‌ చాలా క్లియర్‌గా ఉంది. ఈ ఎన్నికలు మాకు లెక్కే కాదు. మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇప్పటికే గెలుపు ఖాయం. అప్పటి వరకూ ఈ తతంగాలు నడుస్తూనే ఉంటాయి’ అని అన్నారు.

హైడ్‌ ఆప్షన్‌ పెట్టుకోవచ్చు...
‘రాబోయే 15 రోజుల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి. ప్రతి ఓపెన్‌ ప్లాట్‌ దారుడు నాన్‌ అగ్రికల్చర్‌ ఆస్తిగా నమోదు చేసుకోవాలి. ప్లాట్‌ల వివరాలు వెబ్‌సైట్‌లో కనిపించవద్దనుకుంటే హైడ్‌ ఆప్షన్‌ పెట్టుకోవచ్చు. పూర్తి టైటిల్‌ విషయంలో ఓనర్‌ నష్టపోతే ప్రభుత్వమే నష్టపరిహారం ఇస్తుంది. ధరణి పోర్టల్‌ బ్యాకప్‌ అంతా రహస్యంగా ఉంటుంది’ అని చెప్పారు

మరిన్ని వార్తలు