ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

21 Aug, 2020 09:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనపై మంత్రి జగదీష్‌ రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో చిక్కుకుపోయిన తొమ్మిది మందిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 
(శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..)

మంటల్లో చిక్కుకున్నవారి వివరాలు
1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్
2.AE వెంకట్‌రావు, పాల్వంచ
3.AE మోహన్ కుమార్, హైదరాబాద్
4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్
5.AE సుందర్, సూర్యాపేట
6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా
7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ
8,9 హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్

అయితే, ప్రమాద స్థలంలో పొగ తగ్గకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రెస్క్యూ టీం లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. ఆక్సిజన్‌ అందక వెనక్కి వచ్చారు.. సొరంగంలో దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. శ్రీశైలం ఎడమ జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. సహాయక చర్యలను మంత్రి జగదీశ్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోపల చిక్కుకున్న సిబ్బందిని కాపాడేందుకు అధికారులు సింగరేణి సహాయం కోరారు. ఇక ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారికి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారంతా బాగానే ఉన్నారని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. బాధితులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించారు.  పొగ కారణంగా మరో ఆరుగురు అస్వస్థకు గురికావడంతో జెన్‌కో ఆస్పత్రికి తరలించారు.
(గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు..)

ఏపీ సీఎం జగన్‌ దిగ్భ్రాంతి:
తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌​ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎలాంటి సహకారం కావాలన్నా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీ విద్యుత్‌ శాఖ అధికారులు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు