CM KCR Sircilla Tour: మా రాము.. మీకు అన్నమైన పెడుతుండా?

5 Jul, 2021 08:07 IST|Sakshi

నవ్వులు పూయించిన కేసీఆర్‌

సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతున్నంత సేపు సభలో నవ్వులు పూసాయి. తను ప్రవేశపెట్టిన పథకాలు, తనయుడు, జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో గొర్రెలు బాగా అయినయ్‌.. ఇవన్నీ కేసీఆర్‌ గొర్రెలు అంటున్నరు. ఇంకా నయం కేసీఆరే గొర్రె అంటలేరు.’ 

‘ఎస్సారెస్పీ వరద కాల్వలో నీళ్లు బాగా ఉండటంతో మోటర్‌ పెడితే.. ఐదు గజాలు చిమ్ముతున్నయ్‌.. ఆ నీళ్లు కేసీఆర్‌ నీళ్లు అని రైతులు చెబుతున్నరు.’  ‘మీకు ఆకలి అయితుందా. నాకైతే కడుపుల గోకుతుంది. మా రాము.. మీకు అన్నమైన పెడుతుండా..? లేదా..?.. ఓ సారి వరంగల్‌ వెళ్తే.. పొద్దంతా పని చేయించుకుని నాలుగ్గొట్టంగ ఉట్టిగనే నన్ను ఎల్లగొట్టిండ్రు’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కాగా రాజన్నసిరిసిల్ల జిల్లా నూతన కలెక్టరేట్‌ సముదాయం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఇంటిగ్రేటెడ్‌ డ్రైవింగ్‌ స్కూల్, నర్సింగ్‌ కాలేజీ, వ్యవసాయ మార్కెట్‌ యార్డును సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రారంభించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు