గొల్ల, కురుమలకు కేసీఆర్‌ గుడ్ ‌న్యూస్

9 Jan, 2021 14:22 IST|Sakshi

రెండో విడత గొర్రెల పంపిణీకి గ్రీన్ సిగ్నల్

సాక్షి, హైదరాబాద్‌: గొల్ల, కురుమలకు సంక్రాంతి పండుగ కానుకగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) రెండో విడత గొర్రెల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారి కుటుంబాల తరపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం  పథకాలు ప్రకటిస్తే చట్టం చేసినట్లేనని తలసాని పేర్కొన్నారు.(చదవండి: సీఎం కేసీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు)

‘‘బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు మన రాష్ట్రంలో లేవు. వచ్చే అవకాశం లేదు. శుక్ర, గురువారాల్లో కొన్ని ప్రాంతాల్లో కోళ్లు చనిపోయాయని వార్తలు వచ్చాయి. కానీ మహారాష్ట్ర నుంచి వచ్చిన గొర్రెలు వాతావరణం సహకరించక మృతిచెందాయి. తెలంగాణలో కొన్ని చోట్ల కోళ్లు చనిపోయిన మాట వాస్తమేనని, అవి పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావడంతో వాతావరణంలో మార్పు వల్ల చనిపోయాయని’’ మంత్రి వివరించారు. బర్డ్‌ ఫ్లూను ఎదుర్కొనేందుకు 13 వందల బృందాలు రెడీగా ఉన్నాయన్నారు.(చదవండి: స్థానిక ఎన్నికలు: 40 వేల మందికి ఈసీ షాక్‌!)

డీడీలు కట్టిన 28 వేల 335 మందికి సబ్సిడీపై గొర్రెల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, రూ.360 కోట్ల వ్యయంతో గొల్ల కురుములకు గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 16న నల్గొండలో గొర్రెల పంపిణీ  రెండో విడత ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 12 నుండి హైదరాబాద్‌లో ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల  ఉచిత నీళ్ల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల హామీలో భాగంగా ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు. వరదలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు 10 వేల రూపాయలు చెల్లించామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు