ఫర్నిచర్, మొక్కలు బాగున్నయ్‌

13 Feb, 2022 04:02 IST|Sakshi
సీఎం కేసీఆర్‌తో మాటామంతి.. చిత్రంలో గ్యాదరి కిషోర్, మోత్కుపల్లి, కోమటిరెడ్డి, భూపాల్‌రెడ్డి

కితాబు ఇచ్చిన సీఎం కేసీఆర్

యాదాద్రిలో ప్రెసిడెన్షియల్‌ సూట్‌ ప్రారంభం 

యాదగిరిగుట్ట/భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనర సింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా యాదగిరిపల్లి శివారులో వీవీఐపీలు, వీఐపీల బస కోసం నిర్మించిన ప్రెసిడెన్షియల్‌ సూట్, 14 విల్లాలను సీఎం కేసీఆర్‌ శనివారం ప్రారంభించారు. మధ్యాహ్నం 1:09 గంటలకు గండి చెరువుకు చేరుకున్న సీఎం.. 1:11 గంటలకు రింగ్‌రోడ్డు మీదుగా ప్రెసి డెన్షియల్‌ సూట్‌కు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రెసిడె న్షియల్‌ సూట్‌ ప్రధానద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించి సూట్‌ను పరిశీలించారు. సుమారు 21 నిమిషాలపాటు సూట్‌ను తిలకించారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు మొదటి అంతస్తు, గదుల్లో ఏర్పాటు చేసిన ఫర్నిచర్, లాన్, మొక్కలను పరిశీలించి బాగున్నాయని కితాబిచ్చారు. సూట్‌కు ముందు భాగంలో నిర్మించిన భారీ ఎంట్రన్స్‌ వివ రాలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముఖ్యమంత్రికి వివ రించారు. సీఎం వెంట సీఎస్‌ సోమేశ్‌కుమార్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, సీఎంవో స్పెషల్‌ సెక్రటరీ భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు