సీఎం గారూ.. రామయ్య పెళ్లికి రండి

9 Apr, 2021 02:56 IST|Sakshi
కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న ఆలయ ఈవో, అర్చకులు..  చిత్రంలో ఇంద్రకరణ్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులు    

భద్రాచలం: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ నెల 21న జరిగే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆలయ ఈవో బి.శివాజీ, వేదపండితులు కలిసి ఆహ్వాన పత్రిక, జ్ఞాపిక, స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, మాలోత్‌ కవిత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కూడా ఆహ్వాన పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు స్థలశాయి, ఏఈవో శ్రవణ్‌కుమార్, సీసీ అనిల్, అర్చకులు పాల్గొన్నారు.  

చదవండి: ప్రైవేటు టీచర్లపై సీఎం కేసీఆర్ వరాల జల్లు


 

మరిన్ని వార్తలు