కైకాల మృతి బాధాకరం.. ఈ జనరేషన్‌ నటుల్లో ఆయనకు సమానులు లేరు: సీఎం కేసీఆర్‌

23 Dec, 2022 15:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నట దిగ్గజం కైకాల సత్యనారాయణ పార్థీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాళి అర్పించారు. శుక్రవారం మధ్యాహ్నాం నగరంలోని కైకాల నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌.. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.

సినీ నటులు కైకాల సత్యనారాయణగారు విలక్షణమైన నటులు. ఎలాంటి పాత్రలోనైనా జీవించి, హీరోలకు సమానమైన పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎంపీగా  ఉన్న రోజుల్లో.. ఆయనతో కలిసి పని చేసిన  అనుభవం ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేరు. ఆయనకు సమానమైన నటులు ఈ తరంలో ఎవరూ లేరు. కైకాల మృతి చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం అన్నారు సీఎం కేసీఆర్‌.

సీఎం కేసీఆర్‌ వెంట మంత్రి తలసానితో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. అనారోగ్యంతో నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు