CM KCR Press Meet Highlights: జీవో 111ను ఎత్తేస్తున్నాం.. కేబినెట్‌ కీలక నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్‌

12 Apr, 2022 18:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన జీవో 111ను ఎత్తేస్తూ తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం కేబినెట్‌ సమావేశం ముగిసిన అనంతరం.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు స్వయంగా ప్రకటించారు.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ కీల‌క నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఆ నిర్ణయాలను పాత్రికేయ సమావేశంలో స్వయంగా సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. గత హామీ మేరకు జీవో 111ని ఎత్తివేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. సీఎస్‌ ఆధ్వర్యంలో త్వరలోనే ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు.  

అలాగే మే 20 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు ప‌ల్లె, ప‌ట్టణ ప్రగ‌తిని చేప‌ట్టనున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

► రాష్ట్రంలో ఆరు ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతి. అలాగే త్వరలోనే అన్ని యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం మూడున్నర వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఇబ్బందులు, ఆరోపణల నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల తరహాలో కామన్‌ బోర్డు ఏర్పాటు చేసి నియామకాల్ని పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

► హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్‌లో రెండు అదనపు టెర్మినల్స్‌ ఏర్పాటునకు గ్రీన్‌సిగ్నల్‌.

► ఉమ్మడి రాష్ట్రంలో భూగర్భ జలాలపైనే ఆధారపడ్డారు
వడ్లు కొనడం చేతకాదు అని కేంద్రం చెప్పొచ్చు కదా
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సాగు అయ్యింది
కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం అధికారంలో ఉంది
దేశ రాజధానిలో 13 నెలలపాటు రైతులు ఉద్యమాలు చేశారు
వ్యవసాయ చట్టాలు తెచ్చి మళ్లీ తోకముడిచింది
చివరకు దేశ ప్రధాని రైతులకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి
ఎరువుల దరలను భారీగా పెంచారు
పనికిమాలిన విద్యుత్‌ సంస్కరణలు ప్రవేశపెట్టారు
రాష్ట్రాలను దివాళా తీయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది
బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అనే సిద్ధాంతంతో పనిచేస్తోంది.
ఆహార భద్రత బాధ్యత నుండి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం
కేంద్రం బాధ్యతను గుర్తుచేయడం రాష్ట్రంగా మా బాధ్యత
అందుకే ఢిల్లీ వేదికగా కేంద్రంపై పోరాటం చేశాం
బ్యాంకులను దివాళా తీయించడమే మోదీ ఘనత
► యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్రమే కొనుగోలు చేస్తుంది
ధాన్యం కొనుగోలుపై సీఎస్‌ నేతృత్వంలోని సబ్‌ కమిటీ
రైతులు ఎవరూ కూడా ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మకండి
రూ. 1960 కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం
మొత్తం 3,4 రోజుల్లోనే ధాన్యం కొంటాం
6 ప్రైవేట వర్శిటీలకు కేబినెట్‌ ఆమోదం
త్వరలోనే అన్ని వర్శిటీల్లో నియామకాలు
వర్శిటీల్లో 3,500 వరకూ నియామకాలకు నిర్ణయం
దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది

మరిన్ని వార్తలు