కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష.. సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

25 May, 2023 16:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల కార్యాచరణపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఘన కీర్తిని చాటి చెప్పేలా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలి దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు.

హరితహారం, గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ,  దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలకు పరిష్కారం, వానాకాలం పంటల సాగు, ఎరువులు, విత్తనాల పంపిణీ, నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం, వానాకాలం పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా రైతుబంధు పంపిణీ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
చదవండి: మరో బాంబు పేల్చిన సుకేశ్‌ చంద్రశేఖర్‌.. కవిత, కేజ్రీవాల్‌కు షాక్‌

మరిన్ని వార్తలు