కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

26 Jun, 2021 14:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలతోపాటు పలువురు అధికారులుహాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జులై 1 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేయాలని తెలిపారు. కల్తీ విత్తనాల విక్రయంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. వ్యవసాయానికి, రైతుకు ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉండాలని తెలిపారు.

పల్లెలు, పట్టణాల లేఅవుట్లలో ప్రజా అవసరాలపై కేటాయించిన భూమిని.. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పోడు భూముల సమస్యల పరిష్కారంపై నివేదిక రూపొందించాలన్నారు. అటవీ భూముల హద్దులను నిర్దిష్టంగా గుర్తించాలని తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, హరితహారం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు.

చదవండి: దళితులపై చేయి పడితే ఊరుకోం

మరిన్ని వార్తలు