అజ్మీర్‌ దర్గాకు చాదర్‌ పంపిన సీఎం కేసీఆర్‌

19 Feb, 2021 02:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అజ్మీర్‌ దర్గా ఉర్సు ఉత్స వాల్లో సమర్పించే చాదర్‌(గిలాఫ్‌)ను సీఎం కేసీఆర్‌ గురువారం పంపారు. ప్రత్యేకంగా రూపొందించిన చాదర్‌ను ముస్లిం మత పెద్దలు కేసీఆర్‌ ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయ రంగం పురోగమిం చాలని, కేసీఆర్‌ కుటుంబం సంపూర్ణ ఆరో గ్యంతో పరిపూర్ణ జీవితం గడపాలని ప్రార్థిం చారు. ఉత్సవాల సందర్భంగా ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మహ్మద్‌ సలీం, ఎమ్మెల్సీలు మహ్మద్‌ ఫరీదుద్దీన్, ఫారూఖ్‌ హుస్సేన్, ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్, టీఆర్‌ఎస్‌ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు ఖాజా ముజీబుద్దీన్, ముఫ్తి సయ్యద్‌ యూసఫ్, కార్పొరేటర్‌ బాబా ఫసీయుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు