వీఆర్‌ఏలపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌.. వినతిపత్రం విసిరేసి..

2 Oct, 2022 09:11 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌.. ఆయన స్నేహితుడు, మాజీ ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న లక్ష్మీకాంతరావును పరామర్శించారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) అక్కడికి వచ్చారు. తొలుత నలుగురు వీఆర్‌ఏలను లోపలికి తీసుకెళ్లారు.

అందులో వీఆర్‌ఏల జేఏసీ హనుమకొండ జిల్లా కార్యదర్శి సతీశ్‌ ఒక్కడినే అనుమతించగా.. ఆయన సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందించారు. సీఎం ఆ వినతిపత్రాన్ని చదువుతుండగా సతీశ్‌ తమ సమస్యలను వివరించారు. ఈ సమయంలో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వినతిపత్రాన్ని సతీశ్‌ వైపు విసిరేస్తూ.. సమ్మె విరమించాలని చెప్పినా వినడం లేదని, తరచూ కాన్వాయ్‌కు అడ్డుపడుతున్నారని మండిపడినట్టు సమాచారం. దీంతో వీఆర్‌ఏలతోపాటు అక్కడున్న నాయకులు ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. 
చదవండి: కేంద్ర మంత్రులు తిట్టిపోయిన మరునాడే అవార్డులు వస్తున్నాయి: సీఎం కేసీఆర్‌

లక్ష్మీకాంతరావును పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

మరిన్ని వార్తలు