నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

17 Mar, 2021 18:10 IST|Sakshi

హైదరాబాద్: నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం‌ మాట్లాడారు. 100 శాతం తాము పేదల పక్షం ఉంటాం కొన్ని పెన్షన్లు, రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. అతి త్వరలో తప్పకుండా కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. అలాగే కచ్చితంగా 57 ఏళ్ల పైబడిన వారికీ పెన్షన్లు ఇస్తాము వీటి విషయంలో వెనక్కి వెల్లదీ లేదు అన్నారు. కరోనా కారణంగా రాష్ట్రంపై దాదాపు లక్ష కోట్ల రూపాయల భారం పడిందన్నారు. నిరుద్యోగుల భృతికి సంబంధించి విధివిధానాల రూపకల్పనలో ఉన్నప్పుడు ఈ కరోనా వచ్చిందన్నారు. ఆ సమయంలో కొన్ని నెలల పాటు ఉద్యోగులకు వేతనాలే సరిగా ఇవ్వలేకపోయామన్నారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యం కాలేదని సీఎం పేర్కొన్నారు. నిరుద్యోగ భృతిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని.. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని అన్నారు.

చదవండి:

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు

మరిన్ని వార్తలు