దేశాన్ని ఉన్మాద స్థితిలోకి మారుస్తున్నారు: సీఎం కేసీఆర్‌

22 Aug, 2022 18:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 75 ఏళ్ల స్వాతంత్య్ర ఫలాలను భారత ప్రజలు ఆస్వాదిస్తున్న వేళ.. నాటి అమరవీరులను త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎల్బీ స్టేడియంలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. 'ఎంతో మంది త్యాగాలతోనే స్వాతంత్య్రం వచ్చింది. గాంధీ గురించి ఈ తరం పిల్లలకు తెలియాల్సి ఉంది. దేశాన్ని ఉన్మాద స్థితిలోకి మారుస్తున్నారు. దీన్ని చూస్తూ ఊరుకోవడం కరెక్ట్‌ కాదు. దేశం అనుకున్నంత పురోగతి సాధించలేదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు క‌ర‌దీపిక‌లుగా మారి ఏ స‌మాజాన్ని అయితే స‌రైన మార్గంలో న‌డిపిస్తారో ఆ స‌మాజం గొప్ప‌గా పురోగ‌మించే అవ‌కాశం ఉంటుందని' సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

చదవండి: (సీఎం జగన్‌ నిర్ణయంతో మంచి జరుగుతుందని భావిస్తున్నా: ఉండవల్లి)

మరిన్ని వార్తలు