పాలన పరుగు.. పార్టీకి మెరుగు

16 Dec, 2021 02:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో వరుస ఎన్నికలకు బ్రేక్‌ పడింది. పదవీకాలం పూర్తికాక ముందే ఏవైనా సీట్లు ఖాళీ అయితే తప్ప.. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటు పాలన వ్యవహారాలు, అటు పార్టీ బలోపే తంపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రెండేళ్ల కార్యా చరణ అమలుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో వరుసగా జిల్లాల పర్యటనలు చేయనున్నారు. పలు జిల్లాల పర్యట నలు ఇప్పటికే ఖరారు కాగా.. ఇతర జిల్లాలకు వెళ్లే తేదీలను త్వరలో నిర్ణయించ నున్నారు. జిల్లాల పర్యటనల సందర్భంగా జిల్లా స్థాయి నేతలు, కార్యకర్తలతో కేసీఆర్‌ ముఖాముఖి మాట్లాడనున్నట్టు సమాచారం. ఈ పర్యటనలకు ముందే హైదరా బాద్‌లో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో, జిల్లా కలెక్టర్లతో వేర్వే రుగా సమావేశాలు నిర్వహించను న్నారు. ప్రభుత్వ ప్రాథమ్యాలు, లక్ష్యా లను స్పష్టం చేయడంతోపాటు రానున్న రెండేళ్లలో ప్రభుత్వపరంగా, పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, సాధించాల్సి పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు. 

17న పార్టీ నేతలతో సమావేశం
తెలంగాణ భవన్‌లో 17న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ సమావేశం జరగ నుంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ నేతలు ఈ సమావేశంలో పాల్గొనను న్నారు. ఈ సందర్భంగా సంస్థాగతంగా పార్టీ బలో పేతం, నేతల మధ్య సఖ్యతతోపాటు నామినేటెడ్‌ పదవుల భర్తీ అంశాలపై దృష్టిసారించనున్నట్టు సమాచారం.

వరుసగా జిల్లాల్లో..
సీఎం కేసీఆర్‌ ఈ నెల 19న వనపర్తి జిల్లాలో పర్యటించి కలెక్టర్‌ కార్యాలయాన్ని, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. స్థానికంగా వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 20న జనగామ జిల్లాలో కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం మరి కొన్ని జిల్లాల్లోనూ సీఎం పర్యటించనున్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో పర్యటించి ఉమామ హేశ్వర లిఫ్టు, జలాశయం పనులకు శంకుస్థాపన, 100 పడకల దవాఖానా ప్రారంభోత్స వంలో కేసీఆర్‌ పాల్గొనాల్సి ఉంది. ఇక నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి–భువనగిరి, వికారాబాద్‌ జిల్లాల్లోనూ పర్యటించి కలెక్టరేట్లను ప్రారంభించి, స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇదే సమయంలో ఆయా జిల్లాల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాల యాలను సైతం సీఎం ప్రారంభించను న్నారు. ఈ పర్యటనల తేదీలు త్వరలో ఖరారు కానున్నాయి.  
 
18న కలెక్టర్లతో సదస్సు
సీఎం కేసీఆర్‌ ఈ నెల 18న ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో దళితబంధు, ఇతర అంశాలపై సమా వేశం నిర్వహించనున్నారు. మంత్రులు, సీఎస్, ఇతర సీనియర్‌ అధికారులు అందులో పాల్గొంటా రు. ఈ సందర్భంగా హుజూరాబాద్‌ నియోజక వర్గం, ఇతర చోట్ల దళితబంధు అమలుపై సీఎం సమీక్షించనున్నారు. పథకం అమలు విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమా ల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అదే సందర్భంలో ధాన్యం సేకరణ, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం, రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం కొత్త లోకల్‌ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపులు, ధరణి పోర్టల్‌ సమస్యలు, పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలు, పోడు భూముల సమస్యకు పరిష్కారం వంటి అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కలెక్టర్ల సమావేశంలో జిల్లాల వారీగా కలెక్టర్ల పనితీరు, వివిధ కార్యక్రమాల అమల్లో సాధించిన పురోగతిపై సీఎం సమీక్షించనున్నారని తెలిసింది.

మరిన్ని వార్తలు