సీఎం కేసీఆర్‌కు వైరల్ ఫీవర్

26 Sep, 2023 21:44 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత వారం రోజులుగా వైరల్‌ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారు. వైద్యుల బృందం పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించారు. త్వరలోనే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని వార్తలు