‘ఇంకొంచెం వడ్డించమ్మా’.. కేసీఆర్‌ పర్యటనలో ఆసక్తికర ఫోటోలు..

3 Aug, 2021 13:20 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల హామీలను మించి వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు అడిగిన సమస్యలను పరిష్కరిస్తానని ఆనాడు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌.. సోమవారం వాటి అమలు కోసం హాలియాకు వచ్చారు. అక్కడి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నియోజకవర్గ ప్రజాప్రతినిధులతోపాటు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టడంతో మరిన్ని వరాలు ఇచ్చారు. సాగర్‌ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, తాను భగత్‌ను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ది ఏమిటో చేసి చూపిస్తానని చెప్పానని, తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. నియోజకవర్గం అభివృద్దిలో చాలా వెనుకబడి ఉందని, పట్టణం ఏమీ బాగా లేదని చెబుతూనే.. అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను ఇస్తానని ప్రకటించారు.

ఇంకొంచెం వడ్డించమ్మా: ఎమ్మెల్యే భగత్‌ నివాసంలో భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్‌

వంటలు భేష్‌
పెద్దవూర: సీఎం కేసీఆర్‌ స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ స్వగృహంలో మధ్యాహ్న భోజనం చేశారు. సీఎంతో పాటు  మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒకే టేబుల్‌పై కూర్చుని భోజనాలు చేయగా వారికి ఎమ్మెల్యే , ఆమె సతీమణి భవాని వడ్డించారు. భోజనంలో మాంసం, తలకాయ కూర, బొటీ, నాటుకోడి కర్రీ, చికెన్‌ ఫ్రై, చేపల కర్రీ, రోస్టు, పప్పు, సాంబారు, పెరుగు, ఒక స్వీటు వడ్డించారు. ఎమ్మెల్యే భగత్‌ భోజనాలు వడ్డిస్తుండగా మాతో పాటు భోజనం చేయమని సీఎం అనడంతో అతను కూడా వారితో కూర్చుని తిన్నారు. వంటలు బాగున్నాయమ్మా అంటూ సీఎం కేసీఆర్‌ కితాబు ఇచ్చాడు. 

వెల్‌కం సార్‌ : ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం ఇస్తున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌


మీ రాక మాకెంతో ఆనందం : ముఖ్యమంత్రికి మంగళహారతితో స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే భగత్‌ కుటుంబ సభ్యులు 


వెళ్తొస్తా : హెలికాప్టర్‌లో తిరిగి వెళ్తున్న ముఖ్యమంత్రి  

మరిన్ని వార్తలు