ముగిసిన సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన

25 Apr, 2022 19:59 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన ముగిసింది. యాదాద్రి స‌న్నిధిలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ప్ర‌ధానాల‌యంలో స్వామి వారిని దర్శించుకున్న కేసీఆర్ దంప‌తుల‌ను అర్చ‌క బృందం ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. ఆ త‌ర్వాత రామ‌లింగేశ్వ‌ర స్వామి ఆల‌య ఉద్ఘాట‌న క్ర‌తువులో పాల్గొన్నారు. మ‌హా పూర్ణాహుతి, మ‌హాకుంభాభిషేకం పూజ‌లు చేశారు. తొగుట పీఠాధిప‌తి మాధ‌వానంద స‌ర‌స్వ‌తి స్వామివారి చేతుల మీదుగా ఉద్ఘాట‌న క్ర‌తువును నిర్వ‌హించారు. అనంతరం యాదాద్రి నుంచి రోడ్డు మార్గం ద్వారా  సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు చేరుకున్నారు. 

► పూజా కార్యక్రమాలు ముగించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు శివాలయం నుంచి బయటకు వచ్చారు. సీఎం కేసీఆర్‌ దంపతులు ప్రెసిడెన్సియల్ సూట్‌లో మధ్యాహ్న భోజనం చేయనున్నారు.

► అనుబంధ ఆలయమైన పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామీ ఆలయ ఉద్ఘాటన క్రతువులో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. పర్వత వర్దిని  సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం పూజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల మిదిగా ఉద్ఘాటన పర్వాలు జరుగుతున్నాయి.

యాదాద్రి ప్రధానాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహా కుంభాభిషేకంలో పాల్గొననున్నారు.

►  మరికాసేపట్లో యాదాద్రి గుట్టపైన శివాలయంలో నిర్వహిస్తున్న మహాపూర్ణాహుతి, మహా కుంభాభిషకం పూజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారు.

► ఎర్రవెళ్లి ఫాంహౌస్‌ నుంచి యాదాద్రికి బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. యాదగిరిగుట్టకు చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన యాదాద్రి కొండపైకి చేరుకోనున్నారు. 

సాక్షి, యాదాద్రి: సీఎం కేసీఆర్‌ యాదాద్రి కొండపైగల శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభాభిషేకం, స్పటిక లింగ ప్రతిష్ట కార్యక్రమాలకు సోమవారం హాజరుకానున్నారు. కొండపైన గల శివాలయంలో ఈనెల 20 నుంచి మహా కుంభాభిషేకం ఉత్సవాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామీజీ ఆ«ధ్వర్యంలో ఈ ఉద్ఘాటన కార్యక్రమం జరగనుంది. సీఎంతో పాటు దేవాదాయ శాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొననున్నారు.

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తి కావడంతో గత నెల 28న లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన, మహా కుంభాభిషేకంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్న సంగతి తెలిసిందే. లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నూతనంగా నిర్మించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు