29న ‘ధరణి’ ప్రారంభోత్సవం

24 Oct, 2020 01:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ధరణి’పోర్టల్‌ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ముహూర్తా న్ని ఖరారు చేసింది. ఈ నెల 29న మధ్యా హ్నం 12.30కు సీఎం కేసీఆర్‌ ఈ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఈ నెల 25న దసరా రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించాలని తొలుత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. కాగా, సాంకేతిక సమస్యలు, వరద సహాయక చర్యల్లో అధికారులు నిమగ్నం కావడంతో ముహూర్తాన్ని 29కు మార్చారు. ఆ రోజు నుంచి తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసా య భూముల రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నా యి. ప్రస్తుతానికి సాగుభూముల రిజి స్ట్రేషన్లే ప్రారంభించనున్న సర్కారు.. రాష్ట్ర వ్యాప్తంగా 570 మండ లాల్లో దీనికి శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్‌లో వ్యవసాయ భూములు లేనం దున.. దీని నుంచి మినహాయించారు. 

మరిన్ని వార్తలు