వాసాలమర్రిలో రేపటి సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా

9 Jul, 2021 22:15 IST|Sakshi

సాక్షి, యాదాద్రి : వాసాలమర్రిలో రేపటి సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. శనివారం వాసాలమర్రిలో పల్లెప్రగతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు అన్ని ప్రత్యేక ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. కాగా, వాసాలమర్రిని సీఎం కేసీఆర్‌ దత్తత  తీసుకున్న సంగతి తెలిసిందే. గత నెల 22న వాసాలమర్రి గ్రామసభలోనూ ఆయన పాల్గొన్నారు. నిన్న యాదాద్రి జిల్లాలో మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేశారు.

మరిన్ని వార్తలు