తెలంగాణ: సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నేరవేరేనా..?

17 Aug, 2022 10:07 IST|Sakshi

సాక్షి,మేడ్చల్‌ జిల్లా: హైదరాబాద్‌ నగర శివారు హార్టికల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న సీఎం హామీ నీరుగారిపోతోంది. 2020 అక్టోబర్‌ 29న గ్రేటర్‌ సమీపంలోని మూడు చింతలపల్లి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ ప్రాంరంభోత్సవం సందర్భంగా నగర శివారు హార్టికల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తానని ఆయన హమీ ఇవ్వటంతో పాటు ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించాలను ఆదేశించారు. దీనిపై స్పందించిన అధికార యంత్రాంగం శివారుల్లో హారి్టకల్చర్‌ హాబ్‌ను అభివృద్ధి చేసేందుకు మూడేళ్ల వ్యవధిలో రూ.250 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. 

► మూడేళ్లలో అదనంగా 30 వేల ఎకరాల్లో ఉద్యానవన (హార్టికల్చర్‌) పంట సాగు చేసేందుకు ప్రతిఏటా 10 వేల ఎకరాల చొప్పున దశలవారీగా హార్టికల్చర్‌ పంట సాగు పెంచుతామని నివేదించింది. 

► అలాగే శాఖలో ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బందికి అదనంగా ఏడుగురు హారి్టకల్చర్‌ అధికారులు, 10 మంది హెచ్‌ఈఓ పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదనల్లో కోరారు. అయితే ప్రతిపాదనలు నివేదించి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఉద్యానవన పంట సాగు పెంచేందుకు కావలసిన నిధులు ఇవ్వలేదు. హారి్టకల్చర్‌ శాఖలో అదనపు పోస్టుల మంజూరీ అటుంచితే ఖాళీ అయిన పోస్టులను కూడా భర్తీ చేయలేకపోయారు. 

► ఆగిపోయిన ఘట్‌కేసర్‌ రైల్వే బ్రిడ్జి పనులు 

► ఘట్కేసర్‌ రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్డి నిర్మాణ పనులను 2009 సంవత్సరంలో రూ.39 కోట్లతో ప్రారంభించారు. నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని రైల్వే శాఖ తనకు సంబంధించిన సగం వాటా నిధులు సకాలంలో విడుదల చేసి, పనులు పూర్తి చేసినప్పటికిని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా కింద విడుదల చేయాల్సిన నిధుల జాప్యం వల్ల రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగిపోయాయి. పాత పెండింగ్‌ బిల్లుతో కలిపి మొత్తంగా రూ.2 కోట్లు చెల్లించకపోవటం వల్లనే బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి. 

► చర్లపల్లి రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పనులిలా..  

► చర్లపల్లి ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ను దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్‌–కాజీపేట రైల్వే మార్గంలో చర్లపల్లి వద్ద 2018లో రూ.24 కోట్లతో ఆర్‌ఓబీ పనులు ప్రారంభమయ్యాయి. అందులో సగం నిధులను కేంద్రం ప్రభుత్వం విడుదల చేయగా రైల్వే శాఖ పనులు పూర్తి చేసింది. మిగతా సగం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. అయితే...సదరు నిర్మాణ çసంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.9 కోట్లు చెల్లించకపోవటంతో అప్రోచ్‌ రోడ్ల పనులు చేపట్టకుండానే వదిలేశారు. దీంతో చర్లపల్లి ఆర్‌ఓబీ ప్రారం¿ోత్సవానికి నోచుకోవటం లేదు. 

► కీసరగుట్ట దేవస్థానం అభివృద్ధికి రూ.75 కోట్లు మంజూరు చేయాలని మూడేళ్ల కిందట ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.  

► దాదాపు మూడేళ్లుగా మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాకు రెగ్యులర్‌ కలెక్టర్‌ లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొత్త కలెక్టరేట్‌ ప్రారంభం నేపథ్యంలో ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌గా కొనసాగుతున్న మెదక్‌ కలెక్టర్‌ హరీష్‌ను ఇక్కడనే రెగ్యులర్‌ కలెక్టర్‌ నియమించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.  

► నగర శివారు ప్రాంతంగా ఉన్న మేడ్చల్‌ జిల్లాను హైదరాబాద్‌ నగరానికి సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు కావాల్సిన నిధులు ఇవ్వటంతో పాటు పర్యాటక రంగంగా అభివృద్ధి చేయటానికి ఉన్న అవకాశాల మేరకు జిల్లాను పర్యాటక కేంద్రంగా అబివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సీఎం ఇప్పటికైనా నగర శివారు మేడ్చల్‌ జిల్లా సమస్యలపై స్పందించి తగిన నిధుల విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు.   

(చదవండి: 30 వేల మంది విద్యార్థుల జాతీయ గీతాలాపన )

మరిన్ని వార్తలు