రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌కు సీఎం రేవంత్‌

27 Jan, 2024 04:24 IST|Sakshi
ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే. పద్మ పురస్కార విజేతలు కేతావత్‌ సోమ్‌లాల్, ఆనందచారి, గడ్డం సమ్మయ్యలతో గవర్నర్‌

సాక్షి, హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ ముఖ్య నేత లు దూరంగా ఉన్నారు. గవర్నర్‌ తమిళిసై  సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో కలివిడిగా మాట్లాడారు.

హైకోర్టు సీజే అలోక్‌ అరాధే, సీఎస్‌ శాంతికుమారి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, ఏఐసీసీ నేత రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు గోరెటి వెంకన్న, బండ ప్రకాశ్, ఆ ర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. పద్మ పురస్కార గ్రహీతలకు గవర్నర్, సీఎం శుభాకాంక్షలు తెలిపారు. చిందు, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య తేనీటి విందుకు హాజరుకాగా, జ్ఞాపిక అందజేసి గవర్నర్‌ అభినందించారు. కాగా, త్వరలో ఏపీ పర్యటనకు వెళుతున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశాలపై ఏపీతో చర్చిస్తామన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు