మేడిగడ్డకు కేసీఆర్‌ వస్తానంటే హెలికాప్టర్‌ సిద్ధం: సీఎం రేవంత్‌

13 Feb, 2024 10:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు అయిదో రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై సభలో చర్చ జరగనుండగా..కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు.  సభ ప్రారంభమైన తరువాత మేడిగడ్డ బ్యారేజీలో అవినీతిపై సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు మాట్లాడారు.

మేడిగడ్డకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాం: సీఎం రేవంత్‌ రెడ్డి

 • సభ్యులు వాస్తవాలు చూడాలి.
 • మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాం.
 • కేసీఆరే ముందుండి ఈ ప్రాజెక్ట్‌ గురించి వివరిస్తే బాగుంటుంది.
 • బస్సుల్లో రావడం ఇబ్బందైతే హెలికాప్టర్‌లో రావచ్చు.
 • కేసీఆర్‌ కోసం హెలికాప్టర్‌ కూడా సిద్ధం చేస్తాం.
 • సాగునీటి ప్రాజెక్టులే  ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారు.
 • ప్రాజెక్టు రీడిజైన్‌ అనే బ్రహ్మపదార్ధాన్ని కనిపెట్టి అంచనాలు పెంచారు.
 • సాగునీటి ప్రాజెక్టులపై నిన్న చర్చించి వాస్తవాలు చెప్పాం.
 • ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగిందని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పింది.
 • కుంగిన ప్రాజెక్ట్‌ను చూడకుండా గత ప్రభుత్వం దాచిపెట్టింది.
 • అక్కడికి ఎవరూ వెళ్లకుండా భారీగా పోలీసులను పెట్టి అడ్డుకున్నారు.
 • కొందరు అధికారులు డాక్యుమెంటను మాయం చేశారు.
 • ఫైళ్ల మాయంపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాం
 • సభ్యులు వాస్తవాలు చూడాలి.
 • ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలనే మేడిగడ్డ పర్యటన.
 • ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై త్వరలో శ్వేతపత్రం

కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఎప్పుడు ఇలా కాలేదు: మంత్రి శ్రీధర్‌ బాబు

 • మేడిగడ్డ బ్యారేజీలో భారీ అవినీతి జరిగింది.
 • వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది.
 • కాంగ్రెస్‌ హయాంలో కట్టిన డ్యాంలు 50 ఏళ్లకు పైగా ఉన్నాయి.
 • శిథిలావస్థకు చేరిన బ్యారేజీ అసలు కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించాం.
 • విజిలెన్స్‌ కమిటీ ఇదివరకే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
 • అసలు వాస్తవలు ప్రజల ముందు ఉంచేందుకు మేడిగడ్డ పర్యటన.
 • సభ్యులందరినీ ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తున్నాం.
 • అన్ని పార్టీల సభ్యులు మేడిగడ్డకు రావాలి.
 • వాస్తవాలు కళ్లారా చూసేందుకు బీఆర్‌ఎస్‌ను రమ్మంటున్నాం.

అనంతరం శాసనసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. కాసేపట్లో సీఎం రేవంత్‌ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బస్సులో మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు.​

whatsapp channel

మరిన్ని వార్తలు