ఆటోమెటిక్‌ స్టార్టర్లు తొలగించండి 

16 Feb, 2023 03:51 IST|Sakshi
ఎస్‌పీడీసీఎల్‌ ఆపరేషన్స్‌ సీజీఎం జారీ చేసిన మెమో కాపీ 

జిల్లాల విద్యుత్‌ అధికారులకు ఆదేశం 

విద్యుత్, సాగునీరు వృథా అవుతోందనే భావన 

రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ:  వ్యవసాయ పంపు సెట్ల వద్ద రైతులు పెట్టుకున్న ఆటోమెటిక్‌ స్టార్టర్లను వెంటనే తొలగించాలని కింది స్థాయి అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు.. వెంటనే సంబంధిత జిల్లాల ఎస్‌ఈ, డీఈ, ఏడీఈ, ఏఈలు ఆటోమెటిక్‌ స్టార్టర్లు తొలగించేలా చర్యలు చేపట్టాలని ఎస్‌పీడీసీఎల్‌ సీజీఎం (ఆపరేషన్స్‌) ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు (మెమో 3817/22–23) జారీ చేశారు.  ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోనూ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. 

అధిక ధరతో కొన్న విద్యుత్తు వృ«థా అవుతోందనే.. 
వ్యవసాయ పంపు సెట్ల వద్ద ఆటోమెటిక్‌ స్టార్టర్లను ఉపయోగించడం వల్ల ప్రభుత్వం అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్‌ వృధా అవుతోందని, దాంతోపాటు సాగు నీరు కూడా వృథా అవుతోందని ట్రాన్స్‌కో అధికారులు భావిస్తున్నారు. దీన్ని అరికట్టేందుకే ఆటోమెటిక్‌ స్టార్టర్లను తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు