Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌

2 Apr, 2022 17:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో ప్రయాణికులకు మరో గుడ్‌ న్యూస్‌.  హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల వేగం పెంపునకు CMRS‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గంటకు 80 కి.మీ నుంచి 90 కి.మీకి స్పీడ్ పెంచుకునేందుకు CMRS అనుమతిచ్చింది. అయితే, మార్చి 28,29,30 తేదీల్లో మెట్రో రైలు స్పీడ్‌, సెక్యూరిటీని  అధికారులు పరిశీలించారు. తనిఖీల అనంతరం కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్వే సేఫ్టీ సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో స్పీడ్‌ను పెంచుకునేందుకు అనుమతించింది. 

కాగా, మెట్రో రైలు స్పీడ్‌ పెంపుతో ప్రయాణికులకు ట్రావెల్‌ సమయం ఆదా కానుంది. నాగోల్‌-రాయదుర్గం మధ్య 6 నిమిషాలు, మియాపూర్‌-ఎల్బీనగర్‌ మధ్య 4 నిమిషాలు, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మధ్య ఒకటిన్నర నిమిషం ఆదా అవుతుంది.

ఇదిలా ఉండగా.. ప్రయాణికులు కోసం సూపర్ సేవర్ కార్డును  మెట్రో ప్రకటించిన విషయం తెలిసిందే. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కార్డుతో హైదరాబాద్‌లోని 57 మెట్రో స్టేషన్ల మధ్య సెలవు రోజుల్లో రూ.59తో రోజంతా మెట్రోలో ప్రయాణం చేయవచ్చు. 

మరిన్ని వార్తలు