పాఠశాలలో నాగుపాము కలకలం

27 Aug, 2021 10:03 IST|Sakshi

చెన్నారావుపేట: మండలంలోని పాపయ్యపేట హైస్కూల్‌లో పాము కలకలం రేపింది. పాఠశాలలోని ఓ గదిలో నాగుపాము దర్శనమిచ్చింది. బుధవారం అన్ని గదులు శానిటైజర్‌ చేశారు. తొమ్మిదో తరగతి గదిని గురువారం శానిటైజర్‌ చేయడానికి తలుపులు తీయగా ఆ గదిలో నాగుపాము కనిపించింది. ఇన్ని రోజులు పాఠశాలలు తెరిచి లేకపోవడంతోనే పాము కిటికి నుంచి లోపలకి వచ్చి ఉంటుందని ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం పామును సురక్షింతంగా పంట పొలాల్లోకి వెళ్లగొట్టినట్లు హెచ్‌ఎం స్వామి, వేణు, నాగరాజు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ జాటోత్‌ యాకూబ్, జీపీ సిబ్బంది జున్న శ్రీను, తదితరులు ఉన్నారు.     


 

మరిన్ని వార్తలు