మున్సిపల్‌ కమిషనర్ నాన్‌వెజ్‌ ఆర్డర్‌ .. బిర్యానీలో బొద్దింకలు..

4 Aug, 2021 15:22 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌(ఆదిలాబాద్‌):‘చలో.. నడుబై మస్తు బిర్యానీ తిందాం..’ అంట పేరున్న హోటళ్లలో చాలామంది దావత్‌లు చేసుకోవడం సాధారణమైంది. పెద్దపెద్ద బిల్డింగ్‌లలో, హైఫై ఏర్పాట్లతో, ‘గ్రాండ్‌’గా ఉన్న పేర్లను చూసి పోతుంటారు. ఫైవ్‌స్టార్‌ రేంజ్‌లో ఆర్డరు తీసుకోవడం చూసి సంబరపడతారు. ‘ఆ.. రెండు చికెన్, ఒకటి మటన్‌ బిర్యానీ తీసుకురా.. చికెన్‌ల లెగ్‌పీస్‌ ఉండాలె..’అని ఆర్డర్లు ఇస్తుంటారు.

ఇక ఆ తర్వాత హోటల్‌ వాళ్లు పైపై మెరుగులు అద్ది, వేడివేడీగా వడ్డిస్తారు. నచ్చిన తిండి ముందుకు వచ్చింది కదా.. అని ఏమాత్రం చూసుకోకుండా తింటే.. ఇక అంతే సంగతులు. మీ అదృష్టం కొద్ది అందులో ఏ పురుగులో, బొద్దింకలో ఫ్రీగా రావచ్చు. లేదంటే కుళ్లిన చికెన్, మురిగిన మటనే రంగులు అద్దుకుని మీకు అందవచ్చు. ఇదేంటీ.. ఇలా అంటారా..! జిల్లాకేంద్రంలో ఇలాగే జరిగింది. అదికూడా పోయిపోయి సాక్షాత్తు మున్సిపల్‌ అధికారులకే ఎదురు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

అలా వెళ్తే..
ఏదో అలా.. సిబ్బంది కలిసి మధ్యాహ్న భోజనం చేద్దామని నిర్మల్‌ మున్సిపల్‌ కమిషనర్, ఇతర అధికారులు, సిబ్బంది స్థానిక మంచిర్యాల రోడ్డులో బయటకు ఆకట్టుకునేలా ఉన్న ఓ ‘గ్రాండ్‌’ హోటల్‌ కు వెళ్లారు. నాన్‌వెజ్‌ తినేందుకు ఆర్డర్‌ ఇచ్చారు. వారు ఇచ్చిన ఆర్డర్‌ మేరకు వేడీగా బిర్యానీలు వచ్చేశాయి. వాటిని తింటూ ఉంటే.. ముందుగా ఒకరికి ఓ పురుగు వచ్చింది. సర్లే.. ఏదో వచ్చిందనుకున్నారు.

కాసేపటికే మరో ఇద్దరికీ అలాగే జరిగింది. ఇందులో ఏదో తేడా ఉందని మున్సిపల్‌ కమిషనర్‌ వెంటనే కిచెన్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. అంతే.. అక్కడి వాతావరణం, ఫ్రిజ్‌లలో ఎప్పుడో నిల్వ చేసిన నాన్‌వెజ్‌లను చూసి అవాక్కయ్యారు. మిగతా అధికారులు, సిబ్బంది కూడా వచ్చి పరిశీలిస్తే.. అందులో కుళ్లిన చికెన్, మటన్, రెండుమూడు రోజుల క్రితం చేసి పెట్టిన లెగ్‌పీసులు నిల్వ చేసి ఉంచారు. 

పేరుకే పెద్ద హోటళ్లు..
జిల్లాలో చాలా హోటళ్లలో ఇదే తీరు ఉంది. పేరుకేమో పెద్ద హోటళ్లు కానీ.. లోపల కిచెన్‌లలో ఏమాత్రం పరిశుభ్రత పాటించడం లేదు. మున్సిపల్‌ అధికారులు పరిశీలింన సదరు ‘గ్రాండ్‌’లో హోటల్‌ కిచెన్‌రూం మధ్యలో నుం ఓపెన్‌ డ్రెయినేజీ ఉంది. వండిన బిర్యానీ పాత్రను దానిపైనే ఉంచారు. పక్కనే చెత్త, మురికిని పట్టించుకోకుండా అలాగే వండిన పదార్థాలను పెట్టేశారు.

ఇక ఫ్రిజ్‌లలో కుక్కిన నాన్‌వెజ్‌ను చూస్తే ఎప్పుడో వారం క్రితం పెట్టినట్లు ఉన్నాయి. అందులో చాలా వరకు కుళ్లిపోయి. వాటినే కట్‌చేసి కస్టమర్లకు వండిస్తుండటం గమనా ర్హం. ఇక్కడే కాదు.. చాలా హోటళ్లల్లోన ఇలాంటి పరిస్థితే ఉంది. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, చిన్న హోటళ్లలో మరీ దారుణంగా కనీస పరిశుభ్రతను పాటించడం లేదు. కల్తీ నూనెలను, కుళ్లిన పదార్థాలకు రంగులు అద్దుతూ వడ్డిం చేస్తున్నారు. తమ విధుల ప్రకారం తరచూ తనిఖీలు చేస్తే మున్సిపల్‌ అధికారులకు ఇలా ఎదురయ్యేది కాదని పలువురు సోషల్‌ మీడియాల్లో పోస్టులు పెట్టడం కొసమెరుపు.

చర్యలు తప్పవు..
ప్రతి హోటల్‌లో కచ్చితంగా పరిశుభ్రత పాటించా లి. నిల్వ చేసినవి కాకుండా తాజా పదార్థాలతో వండినవే ప్రజలకు అందించాలి. లేనిపక్షంలో కఠిన చ ర్యలు తప్పవు. మంచిర్యాలరోడ్డులో గల హో టల్‌లో కిచెన్‌ను సీజ్‌ చేశాం. ర.50వేల ఫైన్‌కూడా వేశాము. యాజవన్యం సదరు జరిమానాను చెల్లించారు.          

–బాలకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌

మరిన్ని వార్తలు