పెరగనున్న చలి..

19 Dec, 2022 03:21 IST|Sakshi
పాల కడలి కాదిది.. పొగమంచు సోయగం. మంచు తెరల్లో.. ప్రకృతి రమణీయం. చలి క్రమేణా పెరుగుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి బలంగా గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో చలి తీవ్రత కాస్త పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని, గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని స్పష్టం చేసింది. ఆదివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 32.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 13.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు