ప్రతాప రుద్రుని కోటకి కాలినడకన కలెక్టర్‌ శర్మన్

30 Aug, 2020 12:10 IST|Sakshi

సాక్షి, నాగర్‌ కర్నూల్‌: జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామ శివారులోని నల్లమలలో ఉన్న ప్రతాప రుద్రుని కోటను జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించారు. అటవీ శాఖా, పర్యాటక శాఖాధికారులతో కలిసి ఆదివారం ఉదయం ఆయన చారిత్రాత్మకమైన ప్రతాప రుద్రుని కోటను పరిశీలించారు. కొండలపై ఉన్న కోటను ఆయన కాలినడకన వెళ్లారు. పర్యాటకంగా కోటను అభివృద్ది చేసేందుకు గల చర్యలపై అధికారులతో  కలెక్టర్ శర్మన్ చర్చించారు. (తెలంగాణలో కొత్తగా 2,924 కేసులు, 10 మరణాలు)

శ్రీశైలం వెళ్లే పర్యాటకులు కోటపై నుంచి నల్లమల అందాలను వీక్షించే ఏర్పాట్ల చేస్తే పర్యాటకులు మధురానుభూతి పొందుతారని తెలిపారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రతాప రుద్రుని కోటపై ఏడు రకాల జలపాతాలు, పుష్కరిణులు ఉన్నాయి. వాటిని అభివృద్ది చేసి పర్యాటకులకు చేరువ చేస్తే బాగుంటుందని స్థానికులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కాగా కొత్తగా కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టిన శర్మన్ ప్రతాప రుద్రుని కోటను సందర్శంచడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు